Ponnam Prabhakar: గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:05 PM
Telangana: మొదటిసారి వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు. రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. 360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వెల్లడించారు. సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. మహాగణపతి నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లు పొన్నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు. రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.
Ramakrishna: వాటిపై చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి..
360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ క్రేన్లు కూడా ఉన్నాయన్నారు. అవసరమైన ప్రాంతాలకు తరలించదానికి ప్రత్యేక అధికారులు ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రేపు (మంగళవారం) ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. సమయానికి నిమజ్జనం పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ఎల్లుండి వర్కింగ్ డే అని ఆలోపు నిమజ్జనం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
TG News: హుషారుగా లడ్డూ వేలం పాట పాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ ఆ తరువాత
నిమజ్జనానికి సిద్ధమైన..
కాగా.. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్ర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహా గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. ఈరోజు బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు. దర్శనం నిలిపివేత విషయం తెలియక బడా గణేష్ వద్దకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అనుమతి లేకపోవడంతో భక్తులు నిరాశగా వెను తిరుగుతున్నారు. మరోవైపు ట్యాంగ్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మెుత్తంగా 31 క్రేన్లు ఏర్పాటు అయ్యాయి. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?
Read LatestTelangana NewsAndTelugu News