Share News

Minister: రెచ్చగొట్టే వారిని అణిచివేయండి..

ABN , Publish Date - Sep 14 , 2024 | 11:42 AM

ఐక్యతకు హైదరాబాద్‌ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. సోషల్‌ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని సూచించారు.

Minister: రెచ్చగొట్టే వారిని అణిచివేయండి..

- శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండండి

- అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: ఐక్యతకు హైదరాబాద్‌ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. సోషల్‌ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, నగర సీపీ ఆనంద్‌(City CP Anand)తో కలిసి మంత్రి మాట్లాడారు. ‘17న జరిగే నిమజ్జన వేడుకలు రాజకీయాలకతీతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: డబ్బుకు ఏసీపీ దాసోహం.. రూ. కోట్ల ఆస్తుల వ్యవహారంలో సెటిల్‌మెంట్‌


ఇప్పటికే ఉన్నత అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. జంటనగరాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. నిమజ్జనంలో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే పోలీస్‌, రెవెన్యూ శాఖలకు సత్వరమే తెలియజేయాలి. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలి. 16న నిర్వహించే మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ముస్లిం మతపెద్దలు 17న జరుపుకునేలా అంగీకరించారు’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.


శాంతియుత వాతావరణంలో నిమజ్జనం..

కలెక్టర్‌ అనుదీప్‌(Collector Anudeep) మాట్లాడుతూ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని, ఇప్పటికే జిల్లాస్థాయిలో అధికారులతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా పోలీస్‌ యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ఈ వేడుకల్లో మొత్తం 25 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు.


............................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................

Amrapali: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ అప్రోచ్‌ రోడ్ల విస్తరణ..

- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి

హైదరాబాద్: త్వరలో ప్రారంభమయ్యే చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు. రైల్వే టర్మినల్‌ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో శుక్రవారం ఆమె చర్లపల్లి భరత్‌నగర్‌ కాలనీ వైపు ఉన్న ప్రధాన అప్రోచ్‌ రోడ్డుతోపాటు మహాలక్ష్మీనగర్‌ వైపు ఉన్న 40 అడుగుల రోడ్డును పరిశీలించారు. రైల్వే టర్మినల్‌ను అనుసంధానించే అన్ని రోడ్లను పరిశీలించి, రోడ్డు వెడల్పునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

city4.jpg


అప్రోచ్‌ రోడ్ల విస్తరణకు గాను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న టీజీఐఐసీకి స్థలంతోపాటు ఇతర భూముల సేకరణ, ఇళ్ల స్థలాల మార్కింగ్‌ తదితర ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని.. ప్రైవేటు ఇళ్లు, స్థల యజమానులు సహకరించాలని కోరారు. కమిషనర్‌ వెంట మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, ఎస్‌ఈ అశోక్‌రెడ్డి, కాప్రా సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ జగన్‌, చర్లపల్లి ఐలా చైర్మన్‌ జక్కా రోషిరెడ్డి తదితరులు ఉన్నారు.

city4.2.jpg


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 14 , 2024 | 11:42 AM