Home » Punjab
లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాలపై చర్చలను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర శాఖల నేతలతో డిసెంబర్ 29న చర్చలు జరుపనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విపక్షంలో ఉంది.
పంజాబ్ మంత్రి అమన్ అరోరాకు సునామ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కుటుంబ వివాదాల కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. అమన్ అరోరాతోసహా 9 మందికీ రెండేళ్ల జైలు శిక్షను విధించింది.
గ్యాంగ్స్టర్లపై పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఎన్కౌంటర్ తరహాలో వరుస ఘటనల్లో గ్యాంగ్స్టర్లను అదుపులో తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలో గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడిన లక్కీ పటియల్ ముఠాకు చెందిన ముగ్గురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.
గాంగ్స్టర్లపై పంజాబ్ ప్రభుత్వం ఉక్కుపిడికిలి బిగిస్తోంది. గత ఐదు రోజుల్లో ఆరవ ఎన్కౌంటర్ శుక్రవారంనాడు చోటుచేసుకుంది. పంజాబ్ పోలీసులకు, కారు దొంగలకు మధ్య మొహాలీలో చోటుచేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కరడుకట్టిన నేరస్థులు పట్టుబడ్డారు.
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్పాల్ సింగ్ సన్నిహత సహచరుడు కుల్వంత్ సింగ్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. కుల్వంత్ సింగ్ను శుక్రవారంనాడు కోర్టుకు హాజరుపరిచారమని, కోర్టు నాలుగు రోజుల రిమాండ్కు ఆదేశించిందని డీజీపీ అంజలా రిపుతపన్ సింగ్ సంధు తెలిపారు.
తమ దగ్గర ఏవైనా వస్తువులు లేకపోతే బాధపడేవారు చాలామంది ఉంటారు. కానీ తమదగ్గరున్న వస్తువులను తమకు నచ్చినట్టు మార్చుకుని తృప్తి పడేవారు అరుదుగా ఉంటారు. ఈ రిక్షావాలా కూడా ఆ కోవకు చెందినవాడే..
ఐఏఎస్ కలను నిజం చేసుకోవడానికి ఈ కుర్రాడు పడుతున్న కష్టం ఎంతోమంది యువతకు స్పూర్తిగా మారుతోంది.
పంజాబ్లోని స్వర్ణ దేవాలయం డొనేషన్ కౌంటర్ నుంచి ఆగంతకులు లక్ష రూపాయలు దొంగిలించినట్టు గుర్తించారు. గురునానక్ జయంతి ముందు రోజు శనివారంనాడు ఈ దొంగతనం జరిగింది. జయంతి సన్నాహాలు జరుగుతుండగా సందిట్లో సడేమియా అన్నట్టు ఆగంతకులు ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో పంజాబ్ లోపర్యటిస్తున్నప్పుడు తలెత్తిన భద్రతా లోపానికి కారకులుగా పేర్కొంటూ పోలీస్ అధికారుల సస్పెన్షన్ కొనసాగుతోంది. తాజాగా మరో 7 మంది పోలీసులను సస్పెండ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 జనవరి 5న పంజాబ్ లో జరిపిన పర్యటనలో భద్రతా లోపంపై బడిండా ఎస్పీ గుర్వీందర్ సింగ్ సంఘాను సస్పెండ్ చేశారు. పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఈ విషయం తెలిపింది.