Home » Punjab
శాంతిని కోరుకునే పంజాబ్ ప్రజలను గవర్నర్ బెదిరిస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తామని హెచ్చరిస్తూ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ నకు రాసిన లేఖపై భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు.
కొంతకాలం నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. శుక్రవారం సీఎంకు గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్...
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై పంజాబ్ లోని అబోహర్ ఎమ్మెల్యే సందీప్ జాఖఢ్‌పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా కమిటీ ఈ చర్య తీసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింహ్ రాజా వారింగ్ చేసిన ఫిర్యాదుపై క్రమశిక్షణా కమిటీ ఈ చర్య తీసుకుంది.
‘‘నా మూడేళ్ల కుమారుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నా కొడుకును తీసుకుని గురుద్వారకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. నా దగ్గర ఉన్న ఫోన్, పర్సును లాక్కున్నారు. అలాగే నా కొడుకును కూడా తీసుకుని వెళ్లిపోయారు. దయచేసి నా కొడుకును రక్షించండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్’’ అంటూ బతిమిలాడుతూ ఆదివారం ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
పిల్లలు తప్పు చేస్తే సున్నితంగా మందలించాల్సిన తల్లిదండ్రులు.. అందుకు విరుద్ధంగా దారుణమైన శిక్షలు విధిస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ప్రధానంగా ప్రేమ వ్యవహారాల్లో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా...
పంజాబ్‌లో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే.. నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పక్కనే బాధితుని కుమారుడు ఉన్నాడన్న ఇంకితజ్ఞానం లేకుండా..
పంజాబ్ (Punjab) లో అమానుష ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన వాడితో వెళ్లి, తమ పరువు తీసిందని కన్నకూతురు పట్ల ఓ తండ్రి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. కుమార్తె కాలిని తాడుతో కట్టి, ఆ తాడును తన బైక్ వెనకవైపు కట్టుకుని లాక్కెళ్లాడు.
లైక్స్, ఫాలోవర్స్ కోసం ఇన్స్‌ఫ్లుయెన్సర్లు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణ వీడియోలు పెద్దగా వైరల్ అవ్వవు కాబట్టి.. హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. కొందరు పిచ్చి గెంతులు వేస్తే, మరికొందరు ఒక అడుగు ముందుకేసి భయంకరమైన స్టంట్స్ చేస్తుంటారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని, ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా సరే..
పంజాబ్‌లోని టర్న్ టరన్ జిల్లాలో గల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్థాన్ డ్రోన్, మూడు కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయని అధికారులు తెలిపారు.
హెల్మెంట్ ధరించకపోవడంతో ఓ వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆపి తాళాలు లాగేసుకున్నారు పోలీసులు. కానీ ఆ తరువాత అతను పోలీసులకు ఊహించని షాకిచ్చాడు.