Home » Rajasthan
మహిళలపై దాష్టీకాలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూ సభ్యసమాజం తలవంచుకునేలా చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నిచల్‌కోట గ్రామంలో ఇలాంటి అమానుష ఘటనే చోటుచేసుకుంది. 21 ఏళ్ల గిరిజన మహిళలను తీవ్రంగా కొట్టి, వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. సొంత భర్త, అత్తమామలే ఈ పైశాచికానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
కట్టుకున్న భార్య పట్ల తీవ్ర పగ పెంచుకున్న ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను కిడ్నాప్ చేసి చితక్కొట్టి, ఆమెను నగ్నంగా మార్చి వీధిలో ఊరేగించాడు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు సహాయం కోసం వేడుకున్నా.. చుట్టు ఉన్న వారు పట్టించుకోలేదు.
రెడ్ డైరీ వివాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన డిమాండ్‌పై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. మీ దగ్గర ఆ డైరీ ఉందా? ఉంటే బయటపెట్టండి'' అని అమిత్‌షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ నేత దగ్గర అలాంటి డైరీ ఏదీ లేదని అన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వ అవినీతి, తప్పిదాలకు సంబంధించిన వివిరాలు ఉన్న ''రెడ్ డెయిరీ" విషయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. ఎరుపు పేరు వింటేనే సీఎం బెంబేలెత్తిపోతున్నారని అన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్‌కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా పరువు పోగొట్టుకున్నారు.
ఆ యువతికి పెళ్లి కుదిరింది.. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.. పెళ్లికి ముందు రోజు జరిగిన బైక్ యాక్సిడెంట్లో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది.. బైక్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు.. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందనుకున్నారు.. హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న యువతి అసలు విషయం బయటపెట్టింది..
అతను ఒక టీచర్.. జైపూర్‌లోని ఓ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు.. కొద్ది రోజుల క్రితం అదే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌లో ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడింది.. కొన్ని రోజుల క్రితం ఆమె ఆ టీచర్‌ను తన ఇంటికి ఆహ్వానించింది.. టీ తాగడానికి పిలిచింది.. అలా వెళ్లడమే ఆ టీచర్ పొరపాటైంది.
చిన్న చిన్న సమస్యలకూ ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల ఎక్కువైపోతోంది. అందులోనూ విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలిస్తారని, ఉద్యోగాలు రాలేదని, ప్రేమలో విఫలమయ్యామని.. ఇలా వివిధ రకాల సమస్యలకు పరిష్కారంగా చివరకు ...
అక్రమ చొరబాటులకు కళ్లెం వేసేందుకు రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైసల్మేర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల పరిధిలో రాత్రి ప్రయాణాలపై నిషేధం విధించారు.
ఇప్పటివరకు మనం అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తల అడుగు జాడల్లో నడిచే భార్యలను చూశాం. కష్టమైన, సుఖమైన భర్త అనుభవించే వాటి అన్నింటిలో భార్య కూడా పాలుపంచుకుంటుంది.