Home » Royal Challengers Bangalore
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో పోరుకు సిద్దమైంది. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది.
ఐపీఎల్ 2024(ipl 2024)లో ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఈరోజు నెక్ట్స్ మ్యాచుకు సిద్ధమైంది. ఈ ఆరో మ్యాచ్ తమ సొంత స్టేడియం బెంగళూరు( Bengaluru) చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌తో 17వ సీజన్‌కు తెరలేచింది. ఒక వైపున మహేంద్ర సింగ్ ధోని, మరో వైపున విరాట్ కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో వీక్షించారు.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ ఈ శుక్రవారం నుంచే ప్రారంభంకానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా జట్లన్నీ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
టైటిల్ గెలవాలనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 ఏళ్ల నిరీక్షణకు వారి ఉమెన్స్ టీం తెరదించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్‌బాక్స్ ఈవెంట్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కింగ్ అని పిలవొద్దని కోరాడు. అలా పిలవడం తనకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు.
డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును వారి పురుషుల జట్టు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2024 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. వైరల్ అయిన ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్‌తో కోహ్లీ ఆకట్టుకుంటున్నాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024కు సమయం ఆసయన్నమైంది. మార్చి 22 నుంచే ఈ మెగా లీగ్ ప్రారంభంకానుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.