Home » Sharad Pawar
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కేంద్రంలోని ఎన్డీయే కూటమికి దగ్గరవుతున్నారని, ఆయన కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి, పవార్కు కేంద్రంలో మరో కీలక పదవి ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాల నేపథ్యంలో పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ అంశంపై ప్రధాని మౌనాన్ని ఎండగట్టారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమికి భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా? బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీల జాబితా నుంచి ఎన్సీపీ జారిపోబోతోందా?
భారతీయ జనతా పార్టీతో పొత్తు ) విషయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పష్టత ఇచ్చారు. కొంతమంది శ్రేయాభిలాషులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేస్తు్న్నారని, అయితే బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేది లేదని తెలిపారు.
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్ ను ఆయన మేనల్లుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారంనాడు కలుసుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత జూలై 2న ఎన్సీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్ అదేరోజు ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరో చీలిక దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోసారి తిరుగుబాటు తప్పకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ఎన్సీపీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారంనాడు ఒకే వేదకను పంచుకున్నారు. ప్రధాని వేదికపైకి వస్తూనే అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ (Lokmanya Bal Gangadhar Tilak) ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు.
తమ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్రలో మార్పు తీసుకురాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తాము నిమగ్నవడం కష్టమని తెలిపారు. కాకపోతే కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
లోక్సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలతో సమాలోచనలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు ఈ ప్రయత్నాలను గత నెల నుంచి ముమ్మరం చేయగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తాజాగా రంగంలోకి దిగింది. జాతీయవాదాన్ని వినిపించే బీజేపీని దీటుగా ఎదుర్కొనడం కోసం ప్రతిపక్షాలు తమ కూటమికి ‘దేశభక్తి’ని జోడించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.