Home » Siddaramaiah
తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై రాష్ట్రంలో నిరసనలు తీవ్రమవుతుండటంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. నిరసనలను తమ ప్రభుత్వం అడ్డుకోదని, అయితే శాంతి భద్రతలను, ప్రశాంతను పాటించాలని కోరారు. కావేరీ జాలల వివాదంపై తదుపరి విచారణ సుప్రీంకోర్టు మందుకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తుందని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha) ముందు మరో ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల(Deputy CMs)ను నియమించే ప్రతిపాదనను కర్ణాటక(Karnataka) ప్రభుత్వం పరిశీలిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి(Basavaraja Rayareddy) శనివారం తెలిపారు.
కర్ణాటకలో ఎన్నికల్లో (Karnataka Election Results) కాంగ్రెస్ ఘన విజయం (Karnataka Congress) సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో..
'ఆపరేషన్ హస్త'లో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న ఎవరినైనా సరే తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ దివాళా తీసిందని అన్నారు.
కర్ణాటకలో సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందే కుప్పకూలనుందని, 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో 20 ఎంపీ సీట్లు లక్ష్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసససభ్యులతో మూడు రోజుల పాటు సుదీర్ఘ సమావేశాలు జరుపనున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి.
ఎన్నికల్లో తప్పుడు విధానాలను అనుసరించారనే ఆరోపణలకు సంబంధించిన పిటిషన్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని జస్టిస్ సునీల్ దత్ యాదవ్ ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కించపరచేలా సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్‌కు సంబంధించి బీజేపీ కార్యకర్త ఒకరిని శుక్రవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఉడిపి కేసును రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను శకుంతల అనే బీజేపీ కార్యకర్త షేర్ చేస్తూ, దానికి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు జోడించారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో చోటుచేసుకున్న కుంభకోణాలపై సిద్ధరామయ్య సారథ్యంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2021లో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న బిట్ కాయిన్ కుంభకోణంపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర ప్రకటించారు.
కర్ణాటక కాంగ్రెస్‌కు 5 ఉచిత హామీల అమలు విషయంలో ఎదురీత తప్పడం లేదు. ఇందుకోసం కొన్ని సర్దుబాట్లకు మొగ్గుచూపుతోంది. 'అన్న భాగ్య' పథకం కింద అదనపు బియ్యం సేకరణ కష్టంగా ఉండటంతో బీపీఎల్ కార్డులున్న వారికి 5 కిలోల ఉచిత బియ్యానికి బదులుగా నగదును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.