Home » Social Media
సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో హీరో సాయి దుర్గాతేజ్ స్పందించారు. ‘పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఇదే. పేరెంట్స్ అందరూ తమ పిల్లల ఫొటోలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బయట సోషల్ మీడియా ముసుగులో చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి.
వాట్సాప్ సంభాషణలను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
బిహార్లోని వైశాలీ జిల్లాలో కుర్రకారు.. బైక్పై రాజమౌళి సినిమాలో ఈగలాగా దూసుకుపోతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గేమ్స్ ఆఫ్ ఢిల్లీ.. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
కోటి మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగి ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫాం కూ(koo) ఇప్పుడు మూతపడింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ప్రతినిధులే చెప్పడం విశేషం. అసలు ఎందుకు మూతపడింది, కారణాలేంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఫోన్ లేనిదే పిల్లలు నిమిషం ఉండటం లేదు. ఫోన్కు అడిక్ట్ అవుతున్నారు. స్క్రీన్ టైమ్ కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురువుతున్నారు. తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడటం లేదు. ఇదే విషయం పేరంట్స్ వైద్యుల వద్దకు వచ్చారు. ఆరోగ్యంగానే ఉన్నారు.. కానీ మొబైల్ వాడటం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని వివరించారు.
ఐపీఎల్ 2024(T20 World Cup 2024)లో అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పాండ్యా, లేదా టీమిండియాకు పాండ్యా భార్య నటాషా శుభాకాంక్షలు తెలిపిందా లేదా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.
ట్రాన్స్ మహిళల పట్ల సమాజంలో పాతుకుపోయిన రకరకాల అపోహలకు, దురాభిప్రాయాలకు దీటైన సమాధానం సుబ్బలక్ష్మీ రెడ్డి జీవితం. హైదరాబాద్లోని ‘కాదంబరి స్టూడియోస్’
జీ7 సమ్మిట్(G7 Summit) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) భేటీ అయిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటి సారి విదేశీ పర్యటకు వెళ్లారు. దీంతో ఈ టూర్ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జార్జియా మెలోని(Giorgia Meloni) ప్రధాని మోదీ(modi)తో కలిసి నవ్వుతూ సెల్ఫీ తీసుకున్న చిత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇద్దరు యువతులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు వాళ్లని తమ ఇళ్లకు తీసుకెళ్లగా.. ఇక, తాము కలిసి జీవించలేమనే ఆవేదనతో ఆ యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.