CM Chandrababu: పాలకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి..
ABN , Publish Date - Apr 06 , 2025 | 09:59 AM
పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకొందామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రజలకు శ్రీరామనవమి (Sri Rama Navami) శుభాకాంక్షలు (Greetings) తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ (Twitter)లో పోస్టు (Post) చేశారు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను శ్రీ రామచంద్రుడు (Si Ramachandradu) తెలియజేసారని సీఎం చంద్రబాబు అన్నారు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందామన్నారు. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నానని, ఆ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ సీఎం చంద్రబాబు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి లోకేష్ శుభాకాంక్షులు..
ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అని పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ సంర్భంగా మంత్రి సోషల్ మీడియా ట్విట్టర్ వేదిక పోస్టు చేశారు. ధర్మమార్గంలో నడిచిన వారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని, ఈ శ్రీరామ నవమి అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని.. శ్రీరామ చంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. మంత్రి లోకేష్ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read..: 20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..
కాగా కడప ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సీతారాములను దర్శించుకునేందుకు ప్రముఖులు, వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా కీలకఘట్టమైన ధ్వజారోహణకార్య క్రమం ఈరోజు ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈనెల 15 వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11న సీతారాముల వారి కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీరామనవమి రోజున కళ్యాణంలేని ఏకైక ఆలయం ఒంటిమిట్ట కోదండ రామ స్వామి ఆలయమే. కాగా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News