సిద్ధమైన సీతమ్మ బంగారు చీర
ABN, Publish Date - Apr 05 , 2025 | 04:19 PM
Sitamma Gold Saree: సీతమ్మ వారికి బంగారు చీర సిద్ధమైంది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మ కోసం సిరిసిల్ల నేతన్న గోల్డ్ చీరను నేశారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 5: శ్రీరామ నవిమి రోజు భద్రాద్రి సీతమ్మకు సమర్పించేందుకు సిరిసిల్లలో (Siricilla) బంగారు చీర సిద్ధమైంది. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ (Hariprasad) పదిరోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూలవిరాట్ను నేశారు. ఈ చీరపై శ్రీరాముడి శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేశారు. ఒక గ్రాము బంగారం జెరీ పట్టుతో నేసిన ఈ చీర బరువు 800 గ్రాములు ఉంది. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) నేతన్న హరిప్రసాద్ కోరారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Kishan Reddy On MIM: ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 05 , 2025 | 04:19 PM