Home » Srisailam
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్లెట్ (శ్రీశైలం) నుంచి టన్నెల్ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రూ. 60 కోట్ల విలువైన హైడల్ పవర్ కోసం రూ. 2కోట్ల ఖర్చుకు వెనుకాడొద్దని హితవు పలికారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) దంపతులు ఈరోజు(మంగళవారం) దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం, అటవీశాఖ భూముల మధ్య సరిహద్దుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రోజుల నుంచి దేవస్థానం పరిధిలో సరిహద్దుల విషయంలో అటవీశాఖ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
‘‘గత డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నరు. నేను వాళ్లను అడుగుతున్నా.. దేశ తొలి ప్రధాని నెహ్రూ కట్టిన ప్రాజెక్టుల్లో నీటిని ప్రధాని మోదీ తాగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన సింగూరు, మంజీరా నీళ్లను కేసీఆర్, కేటీఆర్, కిషన్‌రెడ్డి తాగలేదా?
శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి. క్షేత్ర పరిధిలోని సత్ర సముదాయాలు కిక్కిరిసి కనిపించాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం నుంచే భక్తులు బారులు దీరారు.
Andhrapradesh: శ్రీశైలంలో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో బొలేరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. అయితే లోయలో పడి చెట్టుకు ఢీ కొట్టి వాహనం ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నారు.
శ్రీశైల భ్రమరాంబ మ ల్లికార్జున స్వామి, అ మ్మవార్లను రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం దర్శిం చుకున్నారు.
శ్రీశైలం శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపుతోంది. రాత్రి సమయం కావడంతో ఆహారం కోసం ఎలుగుబంటి బయటకు వచ్చింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ సమీపంలో కొబ్బరి చిప్పలు తింటూ యాత్రికులకు రోడ్డు పక్కనే కనిపించింది. ఎలుగుబంటిని చూసి యాత్రికులు భయాందోళనలకు గురయ్యారు.