Sri Kalahasti: అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:29 PM
మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.

తిరుపతి: శ్రీకాళహస్తి (Sri Kalahasti) ఆలయం (Temple)లో మహా శివరాత్రి ఉత్సవాలు (Maha Shivarathri Celebrations) వైభవంగా (Grand) జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్బంగా పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) పోటెత్తారు. క్యూలైన్లలో భారీగా భక్తులు బార్లు తీరారు. .బుధవారం తెల్లవారుజాము ఒంటిగంట నుంచే ఆలయ అధికారులు భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. మహా లఘు దర్శనానికి మాత్రమే పరిమితం చేశారు. ఇవాళ రాత్రి ఒంటిగంటకు మహా లింగోద్భవం జరుగుతుంది.
ఈ వార్త కూడా చదవండి..
ఎన్నికల ఫైటింగ్‌కు రెడీ.. చేతులెత్తేసిన వైసీపీ..
ప్రత్యేక దర్శనాల ఏర్పాటు...
సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది. మహాశివరాత్రి నేపథ్యంలో 13 రోజులపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల కారణంగా శ్రీకాళహస్తి విద్యుత్కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది.
భగవంతుని దృష్టిలో అందరూ సమానులే...
శ్రీకాళహస్తి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా విమర్శలకు తావు లేకుండా శ్రీకాళహస్తి ఆలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనని, సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని కొత్త మార్పులు చేశామన్నారు. గతంలో మాదిరి రాజకీయ స్వార్థంతో కాకుండా భక్తులందరికీ ఒకే రకమైన దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. ఇకపై ప్రతి ఏటా ఇలాంటి పద్ధతినే శ్రీకాళహస్తి ఆలయంలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే లాగా ఆలయంలో తిష్ట వేసుకొని అయిన వారికి దగ్గరుండి దర్శనాన్ని కల్పించే పద్ధతికి తాను స్వస్తి పలకడమే మార్పుకు కారణమని చెప్పారు. ఈ ఏడాది ఆలయంలో కొనసాగుతున్న మహాశివరాత్రి దర్శనాలపై భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు
కాగా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో మారుమోగిపోతోంది. భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కాగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తొలుత దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో బాపిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్థానిక శాసన సభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి.. స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. స్వామివారి దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. భక్తుల మనోభావాలను కాపాడటానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనులపండువగా శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్..
వల్లభనేని వంశీకి పోలీసుల షాక్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News