Tunnel Rescue Operations: టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్.. కీలక దశకు రెస్క్యూ ఆపరేషన్
ABN , Publish Date - Mar 01 , 2025 | 10:52 AM
Tunnel Rescue Operations: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తోంది. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కూడా రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మూడు షిఫ్ట్‌ల్లో సహాయక బృందాలు పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం శ్రమిస్తున్నాయి.

నాగర్‌కర్నూల్, మార్చి 1: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో (SLBC Tunnel Rescue Operations) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది. ఆక్వా ఐ సోనార్ టెక్నాలజీ, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)తో టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అధికారులు యత్నిస్తున్నారు. గత వారం రోజులుగా టన్నెల్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు సహాయక బృందాలు శ్రమించాయి. చివరకు 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నిన్నటి (శుక్రవారం)కి 13.61 కిలోమీటర్లను దాటాయి సహాయక బృందాలు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఐదున్నర అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకున్నట్లు సహాయక బృందం గుర్తించింది. అలాగే డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ నీటి ఊట వస్తూనే ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గత రెండు రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం మూడు షిఫ్ట్‌ల్లో రెస్క్యూ టీం పనిచేస్తోంది.
Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
జీపీఆర్ సాయంతో..
ఇక టన్నెల్ లోపల్ జీపీఆర్ పరికరం సాయంతో ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు స్కానింగ్ చేశారు. జీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు బురద మట్టిలోకి ప్రవేశించి, అక్కడున్న వస్తువులు, భాగాలను గుర్తిస్తాయి. వాటి ఆధారంగా నమూనా చిత్రాలు అందుతాయి. మనిషి ఆకారాన్ని పోల్చిన చిత్రం వస్తే ఆ ప్రాంతంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే అవకాశం ఉంది.
ఫేక్ ప్రచారం
మరోవైపు టన్నెల్‌లో సహాయక చర్యలు చేపట్టిన బృందాలకు దుర్వాసన వచ్చిందని.. అవి కార్మికుల మృతదేహాలే అంటూ ఒకింత ప్రచారం జరిగింది. ఈ వార్తలను నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కొట్టిపారేశారు. అందంగా ఫేక్ న్యూస్ అని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో భాగంగా ప్రస్తుతం బురద తొలగింపు, టీబీఎం కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని.. ఎలాంటి సమాచారం తెలిసినా మీడియాకు తెలియజేస్తామని కలెక్టర్ చెప్పుకొచ్చారు.
బాధితుల ఎదురు చూపులు
కాగా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. తమ వారు సురక్షితంగా బయటపడాలని దేవుడిని కోరుకుంటున్నారు. తమ వారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని ఆ ప్రాంతంలోనే వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే వారం రోజులు గడుస్తుండటంతో లోపల వాళ్లు ఎలా ఉన్నారో అని ఒకింత ఆందోళనకు గురవుతున్నారు బాధితుల కుటుంబ సభ్యులు. వీరిని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో గాథ అని చెప్పొచ్చు. డబ్బు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలని ఇంత దూరం వచ్చి ఇలా ప్రమాదంలో చిక్కుకుపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Posani Krishna Murali: అది సజ్జల స్క్రిప్ట్.. పోలీసులతో పోసాని
Vehicle Tracking: వాహనం ఆచూకీ ఇక పక్కా!
Read Latest Telangana News And Telugu News