Brahmotsavams: శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం..
ABN , Publish Date - Feb 28 , 2025 | 11:56 AM
శ్రీగిరిపై బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరుగుతోంది. సాయంత్రం సదస్యం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు.

నంద్యాల జిల్లా: శ్రీశైల క్షేత్రంలో (Srisailam) బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి పదోవరోజుకు (10th Day) చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరుగుతోంది. సాయంత్రం సదస్యం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ క్రతువులకు శుక్రవారం పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలశోద్వాసన, అవబృథం, త్రిశూలస్నానం, వసంతోత్సవం నిర్వహిస్తారు.
ఈ వార్త కూడా చదవండి..
కాగా గురువారం శ్రీగిరిపై బ్రహ్మోత్సవ రథాన్ని అధిరోహించిన మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతుడై అశేష భక్తజనం నడుమ విహరించారు. సాయంత్రం రథశాల వద్ద కలెక్టర్ రాజకుమారి, ఈవో శ్రీనివాసరావు, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో ఆలయ అర్చకులు రథానికి రథాంగపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలో విశేష అర్చనలు, హారతులు అందుకున్న స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో రాజగోపురంమీదుగా రథశాల వద్దకు మేళతాళాలు, భజంత్రీల నడుమ తీసుకొచ్చారు. పుష్ప ప్రియుడైన మల్లయ్యకు సుగంధ పుష్పాలు, పరిమళ ద్రవ్యాలతో అలకంరించిన రథంపై ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేసి సాత్వికబలిగా కొబ్బరికాయలను, గుమ్మడికాయలను సమర్పించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం దాకా, అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు రథోత్సవం సాగింది. రథంపై ఆదిదేవుడు ఆశీనులై సాగుతుండగా... ఓం నమఃశివాయ నామస్మరణతో అశేష భక్తులు శివనామస్మరణ చేస్తూ ఆదిదేవుడి వైభవాన్ని వీక్షించారు.
నేత్రపర్వంగా తెప్పోత్సవం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా ఆలయ రాజగోపురం మీదుగా వెలుపలికి తోడ్కొని వచ్చి మేళతాలాల నడుమ పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన తెప్పపై అశీనులను చేసి విశేష పూజాధికాలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..
వైఎస్సార్‌సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..
ఇదేంది జగన్.. నాడు అలా.. నేడు ఇలా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News