Home » Supreme Court
Telangana: జీవో 29 ని రద్దు చేయాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి తమ న్యాయవాది వివరించారని అభ్యర్థులు తెలిపారు. సోమవారం (అక్టోబర్ 21) రోజు మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని వాయిదా వేసినట్లు చెప్పారు.
డేరాబాబాపై 2015లో గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుపై పంజాబ్- హర్యానా హైకోర్టు ఇచ్చిన స్టేను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు తొలగించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన వారసుడి పేరును ప్రకటించారు. తదుపరి చీఫ్ జస్టి్సగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ఆయన సిఫారసు చేశారు. వచ్చేనెల 10వ తేదీన జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం ముగియనుంది. దిగిపోయే ముందు సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10తో ముగియనుంది. దాంతో తన తరువాత సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సుప్రీంకోర్టులో చంద్రచూడ్ తర్వాత సీనియర్ జడ్జిగా ఖన్నా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు.
సుప్రీంకోర్టులో కొన్ని మార్పులతో కొత్త న్యాయదేవత (లేడీ ఆఫ్ జస్టిస్) విగ్రహం దర్శనమిచ్చింది. చట్టం గుడ్డిది కాదన్న సందేశా న్నిచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల
రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక డీజీపీలను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యాయస్థానం ఆదేశాలతో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఊరట కలిగింది. అలాంటి వారికి ఇబ్బందులు కలిగించబోమని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. అందులో పలు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ క్రమంలో 2024, మే 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. హైకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించారు. దాంతో ఈ ముగ్గురు సీనియర్ న్యాయవాదుల పేర్లు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు సోమవారం సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
దేశంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న దురాక్రమణలు, అక్రమ నిర్మాణాలతో నదుల పర్యావరణ వ్యవస్థకు నష్టం జరుగుతుండడంతోపాటు తరచూ వరదలు సంభవిస్తుండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.