Share News

Supreme Court CJI: సీజేఐ డీవై చంద్రచూడ్ నెక్ట్స్ ప్లాన్ ఏంటీ

ABN , Publish Date - Nov 08 , 2024 | 04:59 PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం రిటైర్ కానున్నారు. రిటైర్మెంట్ అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ, న్యాయమూర్తులు.. కోర్టుల్లో ప్రాక్టీస్ చేయవచ్చా? అంటే..

Supreme Court CJI: సీజేఐ డీవై చంద్రచూడ్ నెక్ట్స్ ప్లాన్ ఏంటీ
CJI DY Chandrachud

న్యూఢిల్లీ, నవంబర్ 08: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10వ తేదీన రిటైర్ కానున్నారు. సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టునున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కేంద్రానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయమూర్తులు పదవి విరమణ చేస్తారు. తర్వాత వారు దేశంలో గల వివిధ కోర్టుల్లో న్యాయవాదులుగా ప్రాక్లీస్ చేయవచ్చా? అనే సందేహాలు పలువురిలో వ్యస్తున్నాయి.


భారత రాజ్యాంగం ఏం చెబుతుందంటే..?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే కాదు ఇతర న్యాయమూర్తులు న్యాయాన్ని రక్షించడంతోపాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో వీరంతా కీలకంగా వ్యవహరిస్తారు. పదవి కాలం ముగిసిన తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(7) ప్రకారం.. సీజేఐలు, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ భారతీయ కోర్టులో న్యాయవాద వృత్తిని నిర్వహించకుండా నిషేధం విధించింది.


నిషేధం ఎందుకు అంటే..?

న్యాయ వ్యవస్థ స్వతంత్రతోపాటు సమగ్రతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొంచిందే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అలాంటి దేశంలో న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా పరిగణింపబడుతుంది. ఆ వ్యవస్థ యొక్క విశ్వసనీయత.. నిష్పాక్షికతపై ఆధారపడి ఉంటుంది. దీంతో న్యాయమూర్తి విధులు నిర్వహించిన అనంతరం న్యాయవాదిగా చేయడానికి అనుమతించినట్టు అయితే పదవి కాలంలో ఇచ్చిన తీర్పులపై పలు సందేహాలు రేకెత్తినట్లు అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. వైరుధ్యాలను నివారించడం, న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కొనసాగించడం, అనవసరమైన ప్రభావాన్ని నిరోధించడం కోసం.. కోర్టుల్లో వీరి ప్రాక్టీస్‌పై భారత రాజ్యాంగం నిషేధం విధించింది.


రిటైర్‌మెంట్ అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఏం చేయవచ్చు...

ది ఆర్బిట్రేషన్ అండ్ కాన్సలైషన్ యాక్ట్ -1996 ప్రకారం.. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు మధ్యవర్తులుగా అంటే ఆర్బిట్రేటర్స్ లేదా మీడియేటర్స్‌ (arbitrators or mediators)గా వ్యవహరించవచ్చు. ఎందుకంటే చట్టపరమైన పలు అంశాలు క్లిష్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను పరిష్కరించడం కోసం వీరిని ఆర్బిట్రేటర్స్‌గా నియమించే అవకాశం ఉంది. .

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన వారిని వివిధ కమిషన్లకు చైర్మన్లుగా ప్రభుత్వం నియమిస్తుంది. జాతీయ మనవ హక్కుల కమిషన్, లేదంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా నియమించ వచ్చు.


చాలామంది పదవి విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తులు.. న్యాయ కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంటారు. న్యాయ శాస్త్రంలో తమకున్న జ్ఞానాన్ని విద్యార్ధులకు బోధిస్తారు. మరికొందరు న్యాయ శాస్త్రాలకు చెందిన పుస్తకాలను రాస్తుంటారు. రాజ్యాంగ బద్ద సంస్థలకు అధిపతులుగా లేకుంటే రాష్ట్రాలకు గవర్నరులు, ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీల్లో సభ్యులుగా నియమించే అవకాశముంది.


సీజేఐలు.. వివాదాలు..

గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గోగోయి విధులు నిర్వహించారు. పదవి విరమణ చేసిన తర్వాత రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఈ వ్యవహారంపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో ఇటీవల వినాయక చవితి వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీనిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై బీజేపీ అగ్రనాయకత్వం స్పందించింది.

For National News And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 11:48 AM