Share News

బ్రదర్స్‌, నన్స్‌కు ఐటీ మినహాయింపులు రద్దు

ABN , Publish Date - Nov 10 , 2024 | 03:27 AM

ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న క్రైస్తవ ప్రీస్ట్స్‌, బ్రదర్స్‌, నన్స్‌కు ఇంతవరకు అమలవుతున్న ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

బ్రదర్స్‌, నన్స్‌కు ఐటీ మినహాయింపులు రద్దు

న్యూఢిల్లీ, నవంబరు 9: ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న క్రైస్తవ ప్రీస్ట్స్‌, బ్రదర్స్‌, నన్స్‌కు ఇంతవరకు అమలవుతున్న ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారికి కూడా టీడీఎస్‌ వర్తిస్తుందని స్పష్టం చేసింది. తద్వారా బ్రిటిష్‌ కాలం నాటి సంప్రదాయానికి ముగింపు పలికింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పన్ను చెల్లించాలంటూ 2014లో ఐటీ విభాగం ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన 93 అప్పీళ్లను కొట్టివేసింది. దేశమంతటా విద్యను విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో 1944లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ పన్ను మినహాయింపును ఇచ్చింది.

Updated Date - Nov 10 , 2024 | 03:27 AM