Tamilisai Soundararajan: మళ్లీ బీజేపీలో చేరిన తమిళిసై..
ABN , Publish Date - Mar 20 , 2024 | 01:22 PM
Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరిల మాజీ గవర్నర్(Ex Governor) తమిళి సౌందరరాజన్(Tamilisai Soundararajan) బీజేపీ(BJP)లో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.
Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరిల మాజీ గవర్నర్(Ex Governor) తమిళి సౌందరరాజన్(Tamilisai Soundararajan) బీజేపీ(BJP)లో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసైకి బీజేపీలోకి సాదర స్వాగతం పలికారు కిషన్ రెడ్డి, అన్నామలై. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా వ్యవహరించిన తమిళిసై.. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె.. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు.
రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవి చేపట్టాలంటే ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యత్వం కలిగి ఉండరాదు. అందుకే.. గవర్నర్ పదవికి ముందుకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న తమిళిసై.. గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన సొంత పార్టీ అయిన బీజేపీలోకే పునరాగమనం చేశారు. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానం నుంచి తమిళిసై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.