Home » TDP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం దీపం పథకం ప్రవేశ పెట్టబోతుంది. దీపావళి రోజున ఆ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.
గుంటూరు జిల్లా తొండపి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగయ్య ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించుకున్నారు. అయితే ఇంటి ఆవరణలో స్థలం లేకపోవడంతో రోడ్డుపై పోయించారు. ఇదే విషయమై వైసీపీ కార్యకర్త సుధీర్ ప్రశ్నించాడు.
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రోడ్లపై గుంతలకు మట్టి కూడా వేయలేకపోయిందనీ, కూటమి ప్రభుత్వం నెలల వ్యవధిలోనే కొత్త రోడ్లు వేస్తోందనీ అభివృద్ధి అంటే ఇదీ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేతజౌళి శాఖ మంత్రి సవిత.. వైసీపీ నాయకులు చురకలు అంటించారు.
మండలంలోని రాచవేటివారిపల్లి వైసీపీ సర్పంచ సుబ్రమణ్యం(మధు)తో పాటు వార్డు సభ్యులు ఆదివారం జరిగిన పల్లె పండుగ వారోత్పవాలలో భాగంగా స్థాని క ఎమ్యెల్యే షాజహానబాషా సమక్షంలో టీడీపీలో చేరారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ అసిస్టెంట్స్‌కు వేతనాలు ఇవ్వలేదని.. గతంలో వైసీపీ చేసిన బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నెపం నెట్టుతారా.. అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలు భయాందోళన చెందేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టించిన జీవో 117ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నామని మాజీ మంత్రి, టీడీపీ నేత పీతల సుజాత పేర్కొన్నారు.
కడప నగరం టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై కొంత మంది గుర్తుతెలియని యువకులు కర్రలతో దాడిచేశారు.
రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్టు ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
రాజధానికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామని, మరో మూడేళ్లలో అమరావతిని సుందరవనంగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇనచార్జి విష్ణువర్ధన రెడ్డిని విమర్శించే స్థాయి నాగరాజు యాదవ్‌కు లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ వేమన్న గౌడ్ అన్నారు.