Home » TDP
ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని, గన్నవరం సభలో తాను కొన్ని హామీలు ఇచ్చానని.. అవి గుర్తున్నాయని, ఎలాంటి సందేహం అవసరం లేదని.. త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తానని మంత్రి లోకేష్ అన్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
గురువారం దీపావళి సందర్భంగా ఏలూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకరోజు ముందుగానే అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తమకు కనీస సమాచారం అందించకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఏంటి అని టీడీపీ నేతలను, అధికారులను జనసేన నాయకులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లలతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని, ఏపీలో ఎఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయని... పెట్టుబడులకు ఇదే సరైన సమయమని లోకేష్ వారికి వివరించారు. వారం రోజులుగా సంస్థల ప్రతినిధులు సీఈవోలు, వైస్ ప్రెసిడెంట్‌తో నారా లోకేష్ వరుస బేటీలు నిర్వహిస్తున్నారు.
రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పేర్కొన్నారు. మండలంలోని ఎంసీపల్లి పంచాయతీ ఏటిగడ్డ తిమ్మాపుురంలో బుధవారం రైతు గొల్ల ముత్యాలప్పకు సబ్సిడీ కింద మంజూరైన డ్రిప్ పరికరాలను ఆయన పంపిణీ చేశారు.
టీడీపీ సభ్యత్వ సంఖ్యను పెంచాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచించారు.
రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌తో పాటు పలువురు అభినందించారు.
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.
అన్నింటి మాదిరిగానే వ్యవసాయ, సాగునీటి పారుదల రంగాలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి.
‘అనవసరంగా చెడ్డపేరు వస్తోంది. ఎమ్మెల్యేగా ఎందుకయ్యామా అని బాధేస్తోంది’ అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వాపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను మంత్రి నారా లోకేష్ కోరారు. అమరావతిని ఎఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, రాష్ట్రంలో ఐటి హబ్‌లకు సహకారం అందించాలని, ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.