Share News

Cheque Bounce Case : హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Dec 11 , 2024 | 06:01 AM

హోంమంత్రి అనితపై ప్రస్తు తం విశాఖపట్నం కోర్టులో ఉన్న చెక్‌బౌన్స్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది.

 Cheque Bounce Case : హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట

  • విశాఖ కోర్టులో ఉన్న చెక్‌బౌన్స్‌ కేసు కొట్టివేత

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): హోంమంత్రి అనితపై ప్రస్తు తం విశాఖపట్నం కోర్టులో ఉన్న చెక్‌బౌన్స్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం కేసు విచారణ సందర్భంగా హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. అనిత తన వద్ద తీసుకున్న రూ.70లక్షలకు గాను 2018లో చెక్కు ఇచ్చారని, అది చెల్లలేదని పేర్కొంటూ వేగి శ్రీనివాసరావు విశాఖపట్నం కో ర్టులో 2019లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి జరిగిన విచారణలో.. హోంమంత్రి తరఫు న్యాయవాది వి.వి.సతీష్‌ తన వాదన వినిపించారు.


చెక్‌ బౌన్స్‌ కేసును రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు, హోమంత్రి నిర్ణయించుకున్నారన్నారు. ఇరువురి మధ్య కుదిరిన రాజీలో భాగంగా ఇప్పటికే రూ.10లక్షలు వేగి శ్రీనివాసరావుకు అందజేశామని, మరో రూ.5లక్షలు చెక్‌ రూపంలో వేగి శ్రీనివాసరావు తరఫు న్యాయవాదికి అందజేస్తున్నామని వివరించారు.

Updated Date - Dec 11 , 2024 | 09:18 AM