Home » Tirupati
తిరుపతి నగర పాలక సంస్థ పన్ను వసూళ్లలో తిరుపతి మూడో స్థానంలో నిలిచింది.
ఒంటిమిట్ట రాములోరి కల్యాణం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఆలయానికి రానున్నారు. భక్తులు, టీడీపీ అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాఢవీధులలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు.
తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు సంప్రదాయ బద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు
తిరుపతిలో మూడు నెలలుగా హడలెత్తించిన చిరుతను ఎట్టకేలకు బోనులో పట్టుకున్నారు. వేద విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడింది
TIrupathi Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్ నిబంధనలను మార్చిన వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
తిరుమల ట్రాఫిక్ సమస్య, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు అలిపిరిలో 15 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధునిక బేస్‌క్యాంప్ ఏర్పాటు చేయనుంది టీటీడీ. 25 వేల మందికి వసతులతో పాటు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించనుంది
తిరుపతిలోని హోమ్ స్టేలో గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేను ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు హోమ్ స్టే నిర్వాహకుల మధ్య ఘర్షణ తలెత్తింది.
YSRCP Leaders Cruelty: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘోరాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ ఫ్యాన్ పార్టీ నేతల ఆగడాలు మాత్రం కొనసాగుతున్నాయి.