Supreme Court Chief Justice: తిరుమలేశుడి సేవలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:16 AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు సంప్రదాయ బద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు

తిరుమల, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారిగా శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం సంప్రదాయ వస్త్రఽధారణతో కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం-1 కాంప్లెక్స్ క్యూలైన్ ద్వారా మహాద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చక బృందం మేళతాళాలు, వేదమంత్రాలతో సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన జస్టిస్ ధ్వజస్తంభాన్ని తాకి అనంతరం గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీజేఐకి అర్చకులు శ్రీవారి శేష వస్ర్తాన్ని మెడలో ధరింపజేశారు. ఈవో, అదనపు ఈవో.. శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్, చిత్రపటాన్ని అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్