Share News

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

ABN , Publish Date - Apr 05 , 2025 | 09:31 AM

YSRCP Leaders Cruelty: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘోరాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ ఫ్యాన్ పార్టీ నేతల ఆగడాలు మాత్రం కొనసాగుతున్నాయి.

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
YSRCP Leaders Cruelty

తిరుపతి, ఏప్రిల్ 5: అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల (YSRCP) అరాచకాలు అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలనే కాదు సామాన్య ప్రజలకు కూడా ముప్పుతిప్పలకు గురిచేశారు. వారు చెప్పిందే శాసనం అన్న రీతిలో వ్యవహరించారు అప్పటి వైసీపీ నేతలు. ఎక్కడ ఏ స్థలం ఉన్నా ఆక్రమించుకోవడం బాధితులను ఇబ్బందులకు గురిచేయడం చూశాం. గత ప్రభుత్వంలో చాలా మంది భూములు కోల్పోయారు. అన్యాయంగా చాలా మంది నుంచి భూములను లాక్కున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే ప్రభుత్వ మారినా కూడా వైసీపీ నేతల అరాచకాలు మాత్రం ఆగడం లేదు.


అందుకు ప్రత్యక్ష ఉదాహరణే తిరుపతి వృద్ధురాలి ఘటన. వైసీపీ నేతల వద్ద ఓ వృద్ధులు ఎదుర్కున్న సమస్యలు వింటే ఛీ అనకుండా ఉండలేదు. ఫ్యాన్ పార్టీ నేతల వల్ల తాను అనుభవించిన బాధలను చెప్పుకుంటున్న ఓ వృద్ధురాలి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వైసీపీ నేతల నుంచి తమను రక్షించాలంటూ బాధితురాలు వీడియో చెప్పడం కలకలం రేపుతోంది. ఇంతకీ వృద్ధురాలిని వైసీపీ నేతల ఏ విధంగా హింసించారు... అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


ఇంటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి వైసీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి ప్రాణ స్నేహితుడు చైతన్య యాదవ్ తనను మోసగించాడని శ్రీదేవి అనే వృద్ధురాలు వాపోయింది. తన ఇళ్లు రాయించుకుని డబ్బులు ఇవ్వకుండా మోసపూరితంగా మురళిరెడ్డికి అమ్మారని మహిళ ఆరోపిస్తోంది. 2021లో రౌడీలతో తన ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించారని కన్నీటి పర్యంతమైంది వృద్ధురాలు. ప్రశ్నించినందుకు తనను చంపడానికి ప్రయత్నించారని వాపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌కు (Minister lokesh) సమస్య చెప్పుకునేందుకు వెళ్లడానికి డబ్బులు కూడా లేవని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలని వేడుకుంది. అలాగే అభినయ్ రెడ్డి అనుచరులు చైతన్య యాదవ్, మరళిరెడ్డిల నుంచి ప్రాణహాని ఉందని.. రక్షించాలని వృద్ధురాలు శ్రీదేవి వినతి చేసింది. ప్రస్తుతం వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ వైసీపీ అధికారంలో ఉండటంతో వృద్ధురాలికి న్యాయం జరగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తనకు న్యాయం చేయాలంటూ తిరిగి పోలీసుల చుట్టూ తిరినప్పటికీ సరైన స్పందన రాలేదు. దీంతో ఆ బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన అరాచకం మరోసారి బయటపడింది.


ఇవి కూడా చదవండి

Missing Case: సికింద్రాబాద్‌లో మిస్టరీగా ఒకే కుటుంబంలో ఆరుగురి అదృశ్యం..

Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 09:40 AM