Home » Tomato Price
టమాట పండించి కోటీశ్వరుడైన కౌడిపల్లి రైతు మహిపాల్ రెడ్డి దంపతులని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో వచ్చి సెక్రటేరియట్లో ముఖ్యమంత్రిని మహిపాల్ రెడ్డి కలిశారు
హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు తగ్గాయి. నెల రోజుల క్రితం స్కిన్లెస్ కిలో రూ.280 నుంచి రూ.320 వరకు పలికాయి. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా వారం రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం స్కిన్లెస్ కిలో రూ.200, లైవ్ కోడి రూ.130-140 ఉండడంతో కొనుగోళ్లకు నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.
దేశంలో టమాటాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో టమాటా ధరలు రూ.150 నుంచి రూ.200కు పైగా ఉన్నాయి. దీంతో సామాన్యులు టమాటాలు కొనడానికి అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో టమాటాల దోపిడీలు ఎక్కువైపోయాయి. రెండు వారాల క్రితం రైతు నుంచి టమాటాల లారీని దొంగిలించిన ఓ జంటను తాజాగా బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. కొన్నిచోట్ల టమాటా రక్షణ కోసం బౌన్సర్లను కూడా నియమిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు టమోటాలతో తులాభారం నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమ కోరిక నెరవేరితో అమ్మవారికి తమ కుమార్తె పేరు మీద నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకున్నారు. సదరు దంపతుల కోరిక నెరవేరడంతో అమ్మవారికి టమోటాలతో తులాభారం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ ఒక పంట పోవడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి కావడంతో బియ్యం రేట్లు పెంచేస్తున్నారు. ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. లలిత, అక్షయ, ఆవుదూడ, బెల్ తదితర రకాలు మూడు, నాలుగు నెలల క్రితం 26 కిలోల బస్తా రూ.1,200-రూ.1,250 మధ్య లభించేవి. ఇప్పుడు రూ.1,450-రూ.1,550కి అమ్ముతున్నారు.