Home » Train Accident
పశ్చిమ బెంగాల్లో కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మరో రైలు ప్రమాదం..! కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన మరువకముందే.. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఉదంతం కళ్లముందు కదలాడుతుండగానే.. ఇంకో ఉదంతం! పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం న్యూ జల్పాయ్గురి(New Jalpaiguri) రైలు ప్రమాదం(Train Accident) తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్‌పై ఘటనా స్థలికి చేరుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో కాంచన్ జంఘా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద దుర్ఘటన న్యూజల్పాయిగూరి వద్ద చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో పలు రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్లో కంచన్ జంఘా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ రైలు ప్రమాదంలో చాలా మంది మరణించారనే వార్త తనను కలచి వేసిందన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరగడంతో కవచ్ వ్యవస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఒకే పట్టాపై రెండు రైళ్లు వస్తున్నప్పుడు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో రైల్వే శాఖ తీసుకొచ్చిన కవచ్ వ్యవస్థను తీసుకొచ్చింది.
పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్సు రైలు ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
పశ్చిమబెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన బాధితులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.