Share News

Kerala Express: విరిగిన పట్టాలపై దూసుకెళ్లిన రైలు.. తప్పిన భారీ ప్రమాదం

ABN , Publish Date - Oct 01 , 2024 | 02:49 PM

లలిత్‌పూర్ స్థానిక రైల్వే యంత్రాంగం పొరపాటు కారణంగా దెబ్బతిన్న ట్రాక్‌పైకి రైలు వెళ్లింది. పట్టాలపై సిబ్బంది పనులు చేస్తుండగా రైలు రావడంతో వెంటనే వారు ఎర్రజెండా ఊపారు.

Kerala Express: విరిగిన పట్టాలపై దూసుకెళ్లిన రైలు.. తప్పిన భారీ ప్రమాదం

న్యూఢిల్లీ: రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వార్తలు కొద్ది వారాలుగా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్‌ (Kerala Express) విరిగిన పట్టాలపైకి దూసుకువెళ్లింది. అయితే తృటిలో భారీ ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

West Bengal: మళ్లీ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు


రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, లలిత్‌పూర్ స్థానిక రైల్వే యంత్రాంగం పొరపాటు కారణంగా దెబ్బతిన్న ట్రాక్‌పైకి రైలు వెళ్లింది. పట్టాలపై సిబ్బంది పనులు చేస్తుండగా రైలు రావడంతో వెంటనే వారు ఎర్రజెండా ఊపారు. ఆ సమయానికి లోక్ పైలెట్ ఎమెర్జెన్సీ బ్రేకులు వేయడంతో అప్పటికే మూడు బోగీలు దెబ్బతిన్న ట్రాక్‌పైకి చేరుకున్నాయి. అయితే ప్రయాణికులు ఎవరూ గాయపడకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. రైలు ఝాన్సీ చేరిన వెంటనే ప్రయాణికులు రైలు దిగి అధికారులను అప్రమత్తం చేశారు.


పెరుగుతున్న ఘటనలు

రైళ్లను పట్టాలు తప్పించేందుకు, ప్రమాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానించే పలు ఘటనలు కొద్ది వారాలుగా చోటుచేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 28న బాంద-మహోబా రైల్వే ట్రాక్‌పై విరిగిన స్తంభం ఒకటి కనిపించడంతో విజిలెంట్ లోకో పైలెట్ సకాలంలో ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. అదే రోజు యూపీలోని బల్లియాలో రైల్వే ట్రాక్‌పై కొందరు దుండగులు పెద్ద బండరాయిని ఉంచారు. లోకోపైలెట్ బ్రేక్స్ వేసినప్పటికీ రాయిని ఇంజన్ తాకింది. దీనికి ముందు, సెప్టెంబర్ 22న యూపీలోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై ఒక గ్యాస్ సిలెండర్‌ను కనుగొన్నారు. లోకో పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

Updated Date - Oct 01 , 2024 | 02:50 PM