Home » Trains
అమరావతి 2.0. ఆరంభంలోనే కేంద్రం శుభవార్త చెప్పింది. రాజధాని అమరావతి రైలుమార్గానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 2,245 కోట్లు మంజూరు చేసింది.
ఒడిశా తీరప్రాంతంలో ‘దానా’ తుఫాన్ కారణంగా దక్షిణమధ్య రైల్వే(South Central Railway) పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా.. తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా రద్దయిన రైళ్లు గురువారం నుంచి ఈనెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
దానా తుపాను కారణంగా అనంతపురం(Anantapur) మీదుగా వేళ్లే బెంగళూరు-హౌరా-బెంగళూరు అప్ అండ్ డౌన్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం. 18464)ను ఈ నెల 23న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను 24న రద్దు పరచినట్లు తెలియజేశారు.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు (25వ తేదీ వరకు) పలు రైళ్లు రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్(Waltheru Division Senior DCM K. Sandeep) తెలిపారు.
‘దానా’ తుఫాన్ ప్రభావంతో తూర్పుకోస్తా, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలోని వివిధ మార్గాల్లో మొత్తం 41 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నట్టు సీపీఆర్ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
దీపావళి పర్వదినం సందర్భంగా కాచిగూడ - తిరుపతి స్పెషల్ రైలు(Kachiguda - Tirupati Special Train)కు ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్(South Central Railway CPRO A. Sridhar) తెలిపారు. ఈనెల 29, నవంబర్ 5, 12వ తేదీల్లో కాచిగూడ - తిరుపతి (07063) స్పెషల్ రైలును రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.
దీపావళి, ఛత్ పండుగల(Diwali and Chhat festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చేందు ప్రయాణికుల సౌకర్యార్థం 804 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైళ్లలో మహిళల కోసం బోగీలను కేటాయించడం అందరికీ తెలిసిందే. ఈ బోగీల్లో ప్రయాణిస్తూ పట్టుబడే పురుషులకు రూ.500 జరిమానా విధించడం, లేదా 6 నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇదిలావుండగా..
హైదరాబాద్లోని వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరే మూడు ప్రధాన రైళ్ల వేళల్లో మార్పులు చేశామని రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
అతితక్కువ చార్జీతో ప్రయాణించే ఎంఎంటీఎస్ సర్వీసులను(MMTS services) మెరుగుపర్చి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.