Home » Venkaiah Naidu
కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Ayyannapatrudu ) ప్రసంగాలు వింటే చాలు రాజకీయాల్లో ఎదుగుతారని చెప్పారు.
భారతీయ చలన చిత్రాలకూ, కళలకూ, పోరాటాలకూ, రాజకీయాలకు, తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ, ఉద్యమాలకూ సంబంధించిన జ్ఞాన, విజ్ఞాన నిలయాలుగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయా రంగాలలో ప్రామాణికమైన ప్రతిభ ఉన్న సుమారు రెండు వందల మంది విశేష వైభవాలతో ‘పూల కొమ్మలు’ పేరిట ఒక ప్రత్యేక సంచిక తెలుగు వాకిళ్ళలో పరిమళించబోతోంది.
‘‘వెంకయ్యనాయుడు.. రాజనీతిజ్ఞుడు. ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు’’ అని ప్రధాని నరేంద్రమోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ని కొనియాడారు.
చట్ట సభల్లో హుందాగా మాట్లాడాలని, రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయని... ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు.
సీనియర్ నేత డి శ్రీనివాస్ అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. డిఎస్ చనిపోయారని చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
రామోజీరావు మరణంతో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్ధ అని తెలిపారు. ఆయన చేతలు, రాతలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రామోజీ రావు వ్యక్తి కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. జీవితంలో స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని... ఆయన చేతలు, రాతలు, చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
Andhrapradesh: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్య నాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... తాను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించా..
పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.