Share News

Venkaiah Naidu: సమాజ నిర్మాణానికి శ్రీరాముడే ఆదర్శం

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:39 AM

శ్రీరాముడు జాతి, వర్ణ వివక్షలేని సమాజానికి ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలను సందర్శించి, సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు

Venkaiah Naidu: సమాజ నిర్మాణానికి శ్రీరాముడే ఆదర్శం

శ్రీరామపురంలో కుటుంబ సమేతంగా వెంకయ్య

వెంకటాచలం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): జాతి, వర్ణ వివక్షలేని సమాజ నిర్మాణానికి శ్రీరాముడే ఆదర్శమని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీరామపురం, చవటపాళెం గ్రామాల్లోని శ్రీకోదండరామాలయాలను శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఆయన దర్శించుకున్నారు. శ్రీరామపురంలో ఆయన సతీమణి ఉషమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. సమాజంలో ఇంకా అక్కడక్కడా ఉన్న వివక్ష, అసహనం వంటి రుగ్మతలను తొలగించేందుకు శ్రీమద్రామాయణ ఆదర్శాలను పిల్లలకు, యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరాముడు అంటే దైవస్వరూపం మాత్రమేకాదని, తరతరాలుగా భారతీయులకు జీవన గమనాన్ని బోధిస్తున్న మానవ స్వరూపం కూడా అని, అందుకే శ్రీరాముని జీవితం నుంచి యువత స్ఫూర్తిని పొందాలని పేర్కొన్నారు. శ్రీరాముడి గురించి యుక్తవయసులో తెలుసుకోకపోతే, ఆ తర్వాత తెలుసుకుని ఏం ప్రయోజనమన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 05:40 AM