Venkaiah Naidu: ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:45 PM
Venkaiah Naidu: ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని సుపరిపాలన అందివ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలు ప్రతిరోజూ రామాయణం, మహాభారతం చదవాలని వెంకయ్యనాయుడు చెప్పారు.

నెల్లూరు: శ్రీరామచంద్రుడు అవినీతి, అక్రమాలు, అసమానతలు లేని ఆదర్శ పాలన చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని చౌటపాళెంలో శ్రీరామనవమి వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు.
ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని సుపరిపాలన అందివ్వాలని సూచించారు. ప్రజలు ప్రతిరోజూ రామాయణం, మహాభారతం చదవాలని చెప్పారు. అవి చదవకపోవడం వల్లే అశాంతి నెలకుందని అన్నారు. చిన్నపిల్లలు సైతం హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమిస్తూ, ఆరాధిస్తూ కాపాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని... అందరూ ఐకమత్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News