Home » Vijayawada News
రాష్ట్ర రాజకీయాలకు విజయవాడ(Vijayawada) గుండెకాయ వంటిది. హాట్బెడ్ ఆఫ్ పాలిటిక్స్‌గా(Vijayawada Politics) గుర్తింపు వుంది. అలాంటి విజయవాడ పార్లమెంటు సీటు(Vijayawada Parliament Seat) తమ ఖాతాలో ఉండాలని ప్రధాన రాజకీయపార్టీలు తపిస్తుంటాయి. గతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్(Congress) బలంగా ఉండేది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. జనసేన(Janasena)లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో కూటమికి నష్టం జరుగుతుందని అంతా అంచనా వేశారు. కాని వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేలా బీజేపీ మరో ప్లాన్ వేసింది.
అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజా దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ పైలా సోమి నాయుడు జగన్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశానని తెలిపారు.
AP Elections 2024: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయవాడ(Vijayawada) సీపీ కాంతిరాణా(CP Kanthi Rana) రాజకీయ నాయకులకు, ప్రజలకు, సోషల్ మీడియా యూజర్లుకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు(Election Code) పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే విషయమై మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కాంతిరాణా..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరుబాట పట్టింది. ఏపీకి హోదా కోసం అఖిలపక్షం వేయాలని, ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం జగన్‌కు డిమాండ్ చేసింది. సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ప్రయత్నించారు.
MP Kesineni Nani Issue: ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్‌బై చెప్పినా ఆయన అనుచరులు ఎవ్వరూ ఆయనతో కలిసి అడుగులు వేయలేదు. ఇది ఓ రకంగా చూస్తే టీడీపీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంత బలంగా ఉందో చెప్పే అంశంగా కనిపిస్తోంది. కానీ..
Vijayawada Traffic Jam: నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. బందర్ రోడ్, వారధి రోడ్, ఏలూర్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపుగా గంటన్నర నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. వీఐపీ వాహనాలను పంపే హడావుడిలో పోలీసులు ఉన్నారు.
Andhrapradesh: ‘మిచాంగ్’ తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 220 కిలోమీటర్లు, బాపట్లకు 330 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.
కాంట్రాక్టర్ల ఆందోళనతో ప్రభుత్వం మంగళవారం చిల్లర విధిల్చింది. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అక్కడక్కడ కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లు జమ చేసింది.