Share News

విజయవాడలో క్యాట్‌ సర్క్యూట్‌ బెంచ్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:00 AM

క్యాట్‌ చైర్మన్‌ ఈ నెల 17న ఈ బెంచ్‌ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 19 బెంచ్‌లు, 21 సర్క్యూట్‌ బెంచ్‌లు ఉన్నాయి.

విజయవాడలో క్యాట్‌ సర్క్యూట్‌ బెంచ్‌

  • 17న ప్రారంభించనున్న క్యాట్‌ చైర్మన్‌

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌) సర్క్యూట్‌ బెంచ్‌ను విజయవాడలో ఏర్పాటు చేశారు. క్యాట్‌ చైర్మన్‌ ఈ నెల 17న ఈ బెంచ్‌ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 19 బెంచ్‌లు, 21 సర్క్యూట్‌ బెంచ్‌లు ఉన్నాయి. ఢిల్లీలో ప్రిన్సిపల్‌ బెంచ్‌ ఉంటుంది. ఏపీలో సర్క్యూట్‌ బెంచ్‌ లేకపోవడం వల్ల ఢిల్లీలోని క్యాట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇకపై రాష్ట్రంలోని ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు తమ సర్వీసుపరమైన అంశాల్లో న్యాయం కోసం విజయవాడలోని సర్క్యూట్‌ బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. సర్క్యూట్‌ బెంచ్‌కు రెగ్యులర్‌ జడ్జిలు ఉండరు. క్యాట్‌ ఉన్నతాధికారులు కేటాయించిన జడ్జిలు వచ్చి కొంతకాలం పాటు ఇక్కడ నమోదైన కేసుల విచారణ నిర్వహించి తిరిగి వెళ్లిపోతారు.

Updated Date - Feb 15 , 2025 | 04:00 AM