Home » Yogi Adityanath
లక్నో: పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొంటున్న అభ్యర్థులకు యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అభ్యర్థుల వయోపరిమితిని మూడేళ్లు సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విధించిన వయోపరిమితిని సడలించాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన పలువురు అధికారులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా తన విధుల్లో అలసత్వం వహించినందుకు సర్వీస్ నుండి తొలగించారని అధికారులు తెలిపారు.
బాబా బాలక్‌నాథ్.. నిన్నటిదాకా ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. కానీ.. ఇప్పుడు ఉత్తర భారతంలో ఈ పేరు మార్మోగిపోతోంది. కారణం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆయన ఉండటమే! యోగి ఆఫ్ రాజస్థాన్‌గా పేరొందిన ఆయన.. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వంలో రాష్ట్రంపై ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని, ఈరోజు ప్రజలంతా యూపీని ఎంతో గౌరవంతో చూస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారంనాడు ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వారు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చూపించేవారని విమర్శించారు.
మత రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తూనే.. ప్రాంతాల పేర్ల విషయంలో బీజేపీ సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ముస్లిం పేర్లున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకొని, వాటి పేర్లు మారుస్తూ సంచలనాలకు దారితీస్తుంది.
తోటి విద్యార్థిపై స్నేహితులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా.. బాధితుడిపై మూత్ర విసర్జన చేయడం ఉత్తర ప్రదేశ్(Uttarpradesh) లో కలకలం రేపింది.
తెలంగాణలో అధికారం పొందడం కోసం.. రాష్ట్రంలో బీజేపీ విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా రంగంలోకి దింపింది. వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకరు.
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరామ చంద్ర మూర్తి దర్శన భాగ్యం ఉచితంగా కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బీజేపీ అగ్రనేతలు నరేంద్రనాధ్ మోదీ, అమిత్ షా, ఆదిత్యనాధ్ యోగీ తదితరులు హైదరాబాద్‌లో మకాం వేశారు. రెండోరోజు ఆదివారం ఉదయం మోదీ రాజ్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి తుఫ్రాన్‌కు వెళతారు.
Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్ బీజేపీ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.