Home » Yogi Adityanath
ఉత్తర ప్రదేశ్ శాసన సభలో శుక్రవారం నవ్వులే నవ్వులు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణ సభలో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని శివపాల్ యాదవ్ కోరడంతో సీఎం చతురతతో స్పందించి, నవ్వులు పూయించారు.
మాఫియా డాన్ల తాట తీస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కన్ను ఈసారి శాసన సభ సమావేశాల తీరుపై పడింది. శాసన సభలో సభ్యులు పత్రాలను చింపుతూ, గందరగోళం సృష్టిస్తూ పత్రికలు, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కుతున్న విషయాన్ని గమనించారు. ఇకపై శాసన సభ హుందాగా, ప్రశాంతంగా కనిపించేలా చేయడానికి ఆయన నడుం బిగించారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఇటీవల మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత నాలుగో రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఉదయం నుహ్‌లోని ఓ హోటల్ కమ్ రెస్టారెంట్‌ను అధికారులు కూల్చేశారు. దీనిని చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) సైంటిఫిక్ సర్వే రెండో రోజు శనివారం ఉదయం పునఃప్రారంభమైంది. ఈ సర్వేకు ముస్లిం పక్షం కూడా హాజరైంది. ఏఎస్ఐ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు.
హర్యానాలోని నుహ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం జరిగిన మత ఘర్షణల వెనుక ‘‘బిగ్ గేమ్ ప్లాన్’’ ఉందని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ చెప్పారు. అయితే లోతైన దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆదరాబాదరాగా ఓ నిర్ణయానికి రాబోమని తెలిపారు. పరిస్థితి మెరుగైన తర్వాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొనేందుకు ఉత్తరాది ను ంచి బీజేపీ జాతీయ
నేరాలు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇళ్లను యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ బుల్డోజర్ యాక్షన్ పట్ల కొందరు వ్యతిరేకత చూపుతున్నారు. ఒక్కరు చేసిన పాపానికి ఇల్లు మొత్తం కూల్చేసి.. వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడేలా చేయడం ఎంతవరకు సమంజసం?
జ్ఞానవాపిని మసీదు( Gyanvapi Mosque) అనడమే ఓ వివాదమంటూ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఉండటాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. అది మసీదే అయితే అక్కడ త్రిశూలం ఎందుకుంది? అని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
కొందరు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుని, తమలోని ప్రతిభకు పదును పెట్టి.. తద్వారా లక్షలు గడిస్తున్నారు. మరోవైపు మరికొందరు ఇదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఉన్నత విద్యావంతులు, అధికారులను సైతం బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల...