Aadhaar Card: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. మోదీ, యోగి ఆధార్‌ కార్డుల్నే వాడేశాడు.. వాటిని మార్చాలని ట్రై చేసి..!

ABN , First Publish Date - 2023-07-26T17:35:43+05:30 IST

కొందరు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుని, తమలోని ప్రతిభకు పదును పెట్టి.. తద్వారా లక్షలు గడిస్తున్నారు. మరోవైపు మరికొందరు ఇదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఉన్నత విద్యావంతులు, అధికారులను సైతం బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల...

Aadhaar Card: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. మోదీ, యోగి ఆధార్‌ కార్డుల్నే వాడేశాడు.. వాటిని మార్చాలని ట్రై చేసి..!

కొందరు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుని, తమలోని ప్రతిభకు పదును పెట్టి.. తద్వారా లక్షలు గడిస్తున్నారు. మరోవైపు మరికొందరు ఇదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఉన్నత విద్యావంతులు, అధికారులను సైతం బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ వ్యక్తి నిర్వాకం చూసి పోలీసు అధికారులే ఖంగుతిన్నారు. ఈ యువకుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధార్ కార్డులనే వాడేశాడు. చివరకు వాటిని మార్చాలని కూడా ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఓ వ్యక్తికి సంబంధించిన వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. బీహార్ ముజఫర్‌పూర్‌లోని (Bihar Muzaffarpur) సదత్‌పూర్ గ్రామానికి చెందిన అర్పణ్ దూబే అలియాస్ మదన్ కుమార్ అనే యువకుడు.. సాదత్‌పూర్‌లో ఉంటూ ఓ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన ఇతడికి.. టెక్నాలజీలో మాత్రం ఎంతో అవగాహన ఉంది. అయితే ఈ ప్రతిభను మంచి పనులకు ఉపయోగించాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అది కూడా ఏకంగా ప్రధాని మోదీ, సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Prime Minister Narendra Modi and CM Yogi Adityanath) ఆధార్ కార్డులనే టార్గెట్ చేశాడు. చివరకు వారి ఆధార్ కార్డులను (Aadhaar Card) ట్యాంపరింగ్ చేశాడు.

Viral Video: నాన్నా.. కొత్త షూ కొన్నానంటూ కొడుకు తెచ్చిచ్చాడో పార్శిల్.. ఖరీదెంతో చెప్పాక ఆ తండ్రి రియాక్షన్ చూస్తే..!

అనంతరం వాటిని పలు కార్యకలాపాలకు వినియోగించాడు. అంతటితో ఆగకుండా ఇటీవల ఆధార్ కార్డు పోర్టల్ ద్వారా మోదీ, యోగీ డేటాను ట్యాంపర్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. వారిద్దరి పుట్టిన తేదీతో సహా.. ఇతర డేటాను తారుమారు చేసే ప్రయత్నం చేయబోయాడు. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. చివరకు ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని వివరాలను సేకరించారు. బుధవారం పోలీసుల బృందం ముజఫర్‌ఫూర్‌కు చేరుకుని, ఆహియాపూర్, కాంతి పోలీసుల సహకారంతో బృందాలుగా దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral: ఇదేంటి..? ఇలా ఉందని అవాక్కవుతున్నారా..? అసలు దీన్ని దేనితో తయారు చేశారో తెలిస్తే మరింత షాక్..!

Updated Date - 2023-07-26T17:38:59+05:30 IST