Home » Telangana » Hyderabad
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తోంది.
Farmula E Car Race: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారం.. ఇప్పుడు..
హత్యలకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మహమ్మద్ సిరాజ్ అలీ, భార్య హేలియ, కుమారుడు హైజాన్.. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిరాజ్ భార్య, కొడుకుని హత్య చేసిన తర్వాత సూసైడ్ నోటు రాసి ఉరి వేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిరాజ్ కుటుంబం..
ఆడియో సందేశాన్ని మోహన్ బాబు విడుదల చేశారు. ఆరోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వివరించారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మోహన్ బాబు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి కొంచెం కుదుటుపడటంతో ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం నాడు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన సీఎం ఇవాళ(గురువారం) ఢిల్లీకి చేరుకున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
ఏఐసీసీ కార్యదర్శి విష్ణుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ వ్యవహారం సరిగ్గా లేదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను చంపేస్తారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ రాష్ట్రంలో ఉన్నారా.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ..
Telangana: లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులను ఆరా తీశారు సీఎం. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
రేవంత్ రెడ్డి అనే అహంకారితో గిరిజన, దళిత రైతులు నెల రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తనమీద దాడి జరగలేదని స్థానిక కలెక్టర్ హుందాగా వ్యవహరించారని చెప్పారు. రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా కలెక్టర్ దాడి జరగలేదని చెబుతున్నారని అన్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే జైల్లో ఉంటున్న నిందితుడికి గుండెపోటుకు గురయ్యాడు.
నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీ చిక్కిన నిఖేష్ కుమార్.. రోజుకు రూ. 2 లక్షలకుపైగా సంపాదించాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలంలోనే అడ్డగోలుగా సంపాదించాడు. నిఖేష్ కుమార్‌తోపాటు అతని సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17 కోట్ల 73 లక్షల అక్రమాస్తులు వెలుగుచూశాయి.