Home » Telangana » Hyderabad
మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అన్నారు.
సచివాలయం ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసింది. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఫేస్ రికగ్నిషన్ డిజిటల్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకుసంబంధించిన ఐడీ నెంబర్లతో సహా ఫేస్‌లను మిషన్‌లో అధికారులు నమోదు చేశారు.
తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని.. అందుకే ప్రచారంలో వెనుకబడ్డమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలనను తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.
ప్రేమ కోసం మతం మార్చుకున్నా యువతిని శారీరకంగా వాడుకుని మోసం చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వైజాగ్ నుంచి వచ్చిన యువతి బ్యూటిషయన్గా సిర్థ పడింది. క్యాబ్ డ్రైవర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికి వాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి విషయం వచ్చేసరికి...
Telangana: మంచు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. జన్‌పల్లిలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మోహన్ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు... తొలుత మోహన్ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శుక్రవారం (రెండు రోజులు) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు.
ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుతుండగా గొడవ జరగడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆదివారం మంచు మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి తనపై తండ్రి మోహన్‌బాబు, ఆయన అనుచరులు దాడి చేశారని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత పూర్వకంగా ..
Telangana: కుంట్లూర్ పెద్ద చెరువును కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారన్న ఆరోపణలతో నిన్నటి నుంచి హైడ్రా అధికారులు సర్వే చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డిపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో త్వరలో కమిషనర్‌పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల నోటీసులపై మోహన్‌బాబు తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి..