Mohanbabu: మోహన్‌బాబుకు గుడ్‌న్యూస్.. పోలీసుల నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 11 , 2024 | 03:38 PM
పోలీసుల నోటీసులపై మోహన్‌బాబు తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి..
సినీ నటుడు మోహన్‌బాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. తనపై నమోదైన కేసులకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు జారీచేశారు. పోలీసుల నోటీసులపై మోహన్‌బాబు తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే కుటుంబంలో తలెత్తిన వివాదంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మోహన్‌బాబుకు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
హైకోర్టు ఏమందంటే..
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఈ పరిస్థితుల్లో పోలీసుల విచారణకు హాజరుకాలేనని మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మోహన్‌బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై స్టే విధించింది. రెండు పరస్పర ఫిర్యాదులకు సంబంధించిన కేసులు కాకుండా.. మోహన్‌బాబుపై మరో కేసు నమోదైందని పోలీసుల తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జర్నలిస్ట్‌పై దాడిచేసిన ఘటనపై మోహన్‌బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని కోర్టుకు తెలిపారు. నోటీసులు అందుకున్న మంచు మనోజ్ ఇవాళ విచారణకు హాజరయ్యారని తెలిపారు. మరోవైపు మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని మోహన్‌బాబు తరపు న్యాయవాది నగేష్ కోర్టును కోరారు. పోలీస్ పికెట్ ఏర్పాటుచేయడం సాధ్యం కాదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి రెండు గంటలకు ఓసారి మోహన్‌బాబు ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది.
అసలేం జరిగింది..
మోహన్‌బాబు తన కుమారుడు మనోజ్ మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. దీంతో మనోజ్, మోహన్‌బాబు పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో విచారణ కోసం పోలీసులు మోహన్‌బాబు, మనోజ్‌కు వేర్వేరుగా నోటీసులు జారీచేశారు. మనోజ్ విచారణకు వెళ్లగా మోహన్‌బాబు మాత్రం వెళ్లలేదు. ఆరోగ్య పరిస్థితి బాగోలేదని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం అడ్మిట్ అయ్యారు. దీంతో మోహన్‌బాబు తనకు విచారణ నుంచి మినహాయింపు కావాలని కోర్టును ఆశ్రయించగా ఉపశమనం లభించింది. మరోవైపు మంగళవారం ఓ జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడిచేయడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై కూడా ఓ కేసు నమోదైంది. తాజాగా కోర్టు పోలీసులు జారీచేసిన నోటీసులపై స్టే విధించడంతో మోహన్‌బాబుకు కొంతమేరకు ఊరట లభించినట్లైంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here