Home » Telangana » Hyderabad
హైదరాబాద్: డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2009, డిసెంబర్ 9న అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఒక ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెడుతున్నామని తెలిపారు. ఇది చరిత్రలో నిలిచిపోయిన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు.
అసెంబ్లీలో తెలంగాణ తల్లిపై చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన చేశారు. సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అని.. 4కోట్ల ప్రజలను ఏకం చేసి నడిపించిన తల్లి తెలంగాణ తల్లి అని తెలిపారు.
Telangana Assembly Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తరువాత తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
తెలంగాణ అసెంబ్లీ శీతకాల సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన బీఆర్ెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసెంబ్లీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Telangana: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
డ్యాన్సర్ అసోసియేషన్ కార్డులు జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా సోమవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.
సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు.. అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీ ఆస్తి పంచాయతీలో మంచు మనోజ్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేయనున్నారు.
రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దాంతో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులను జారీ చేశారు. అసెంబ్లీతో పాటే శాసన మండలి సమావేశాలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.