Share News

Telangana: డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు.. ఏంటంటే..

ABN , Publish Date - Dec 09 , 2024 | 11:06 AM

హైదరాబాద్: డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2009, డిసెంబర్ 9న అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఒక ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెడుతున్నామని తెలిపారు. ఇది చరిత్రలో నిలిచిపోయిన స్టేట్‌మెంట్ ఆయన ఇచ్చారు.

Telangana: డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు.. ఏంటంటే..

హైదరాబాద్: డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2009, డిసెంబర్ 9న అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఒక ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెడుతున్నామని తెలిపారు. ఇది చరిత్రలో నిలిచిపోయిన స్టేట్‌మెంట్ ఆయన ఇచ్చారు. అలాగే డిసెంబర్ 9 కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు. ఆరోజే చిదంబరం ప్రత్యేక తెలంగాణపై ప్రకటన చేశారు. మరోక ప్రత్యేకత ఏంటంటే దాదాపు 10 రోజులపైచిలుకు అప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు. ఈ స్టేట్‌మెంట్ తర్వాత ఆయన కూడా దీక్ష విరమించిన రోజు. కాబట్టి డిసెంబర్ 9కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శీతాకాల సమావేశాలను సోమవారం (డిసెంబర్ 9) ప్రారంభించింది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఈరోజే ఆవిష్కరించబోతోంది. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సచివాలయంలో లక్ష మంది మహిళల సమక్షంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అలాగే నేటి నుంచి ప్రజాపాలనకు సంబంధించి విజయోత్సవాలు ఈరోజుతో ముగుస్తాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం

మనోజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్న పోలీసులు..

పారిపోయిన టెన్తు విద్యార్థుల కథ సుఖాంతం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 09 , 2024 | 11:06 AM