Home » Telangana » Karimnagar
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పులు లేకుండా చూడాలని, ఎన్యూమరేటర్లు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 17, 28 వార్డుల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల ఇంటింటి సర్వేను పరిశీలించారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికా రులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు డి శ్రీని వాస్, అసోసియేట్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, ఉద్యోగ జేఏసీ చైర్మన్ బొంకూరి శంక ర్, సెక్రెటరీ జనరల్ తూము రవీందర్ డిమాండ్ చేశారు.
సాక్షాత్తు వేములాడ రాజన్న ఆలయానికి ఏటా వంద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని మాట తప్పినం దుకు మాజీమంత్రి హరీష్‌రావు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు చెంపలు వేసుకొని క్షమాపణ కోరుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడలోని ఆయన నివాసంలో మాట్లాడారు.
పగ, ప్రతీకారాలు మాని పరిపాలనపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం వేములవాడలో రాజ రాజేశ్వరస్వామిని దర్శింకున్న అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దిగువ మానేరు రిజర్వాయర్ (ఎల్ఎండీ) నిర్మాణం కోసం తమకు జీవనాధారమైన భూములను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇచ్చారు.
గ్రామాల్లో చేపట్టి న అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ సర్పంచుల ఫోరం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రికత్తకు దారి తీసింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని శాంతియుతంగా నెలరోజులు రిలే దీక్షలు, ఆందోళనలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మాజీ సర్పంచులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మహిళ రంగవల్లి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం రంగవల్లి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి నందికమాన్ సమీపంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి ప్రారంభించారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా జరుగనున్నాయి. సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని చెంజర్లలో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు.