Home » Telangana » Nizamabad
రెండేళ్ల కాలపరిమితితో నిర్వహించే ఎక్సైజ్ టెండర్ల దరఖాస్తు శుక్రవారంతో ముగిసింది. 2021-23 మద్యం పాలసీ కంటే 2023-24 పాలసీలో దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఆదాయం రూ.43.48 కోట్లు వచ్చింది. గతేడాది కంటే 23 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే మహిళల పేరిట కూడా ఎక్కువ మంది టెండర్లు వేశారు. జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్హాల్లో సోమవారం లక్కీడ్రా నిర్వహించనున్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పర్యవేక్షణలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్‌రాజ్ ఆధ్వర్యంలో ఇవి కొనసాగనున్నాయి.
కుష్టు అనే చర్మ సంబంధిత వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించక పోవడం వల్ల వ్యాధి తీవ్రంగా మారి అంగవైకల్యం వచ్చి మానసికంగా కుంగి పోతున్నారు. అంతేకాకుండా ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కావడంతో సమాజంలో ఈ వ్యాధి సోకిన వారిని ఎవరు హక్కున చేర్చుకోకపోవడం వల్ల విగత జీవులుగా మారి మరణానికి దగ్గరవుతున్నారు. కుష్టు సోకిందంటే చుట్టు పక్కల వారు దూరం పెడుతారనే భయంతో కొందరికి లక్షణాలు కనిపిస్తున్నా వ్యాధి ముదిరేంత వరకు బయటకు రావడం లేదు.
నిర్మల్: టౌన్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అలజడి రేగింది. ప్లాన్ రద్దు కోసం ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకోవడానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టు ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వరుస ఓటమి చవిచూసినా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్ సెగ్మెంట్లలో టికెట్ల కోసం కొనసాగుతున్న నాయకుల పోటి, పార్టీకి ఉన్న ఓటింగ్ బలానికి అద్దం పడుతోంది. జిల్లాలోని ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు టికెట్ కోసం ఆశావహులు హోరాహోరీగా పోటీ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని అధిష్ఠానం ఇటీవల ఆదేశించింది. దీంతో జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నుంచే ఐదుగురు నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు షబ్బీర్అలీకే ఖాయం కానుంది. బాన్సువాడలోనూ పోటీ అంత లేకున్నప్పటికీ కొందరు ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 2174 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వైన్స్‌షాపులకు ఇంతపెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారి అని ఎక్సైజ్‌శాఖ అఽధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల కారణంగానే వైన్స్‌లకు డిమాండ్ ఏర్పడిందని, రియల్ రంగం కుదేలుకావడం, ఆ వ్యాపారులంతా మద్యం వ్యాపారానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి వైన్స్‌కు 88 వచ్చాయి.
జిల్లాలో క్రీడామైదానాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిధులు కేటాయించినా ఫలితం లేకుండా పోతోంది.
జిల్లాలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు రైతులు ఐక్యంగా ఉద్యమించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అథితి గృహంలో గురువారం చెరుకు ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజవర్గంలో అభివృద్ధి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు మోసపోవద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం భీమ్‌గల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
జిల్లాలో మద్యం షాపుల టెం డర్లపై అన్ని పార్టీల నేతలు నజర్ పెట్టారు. టెండర్లకు ఒక రోజు మిగిలి ఉండగా జోరుగా దర ఖాస్తులను అందజేస్తున్నారు.
జిల్లాలో ఈ సారి మద్యం దుకాణాలను ఎలాగైన దక్కించుకోవాలనే భావనలో కొందరు మద్యం వ్యాపారు లు, మరికొందరు ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 5 ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో అత్యధికంగా మద్యం సేల్స్ అయి లాభాలు వచ్చే వైన్స్లనే టార్గెట్‌గా చేసుకుని దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి వైన్స్‌ల కు దరఖాస్తులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఎన్నికల కారణంగా ఈసారి మద్యం దుకాణాలు దక్కించుకుంటే మంచి లాభాలే ఉంటాయని భావిస్తు మద్యం వ్యాపారు లు టెండర్లపై దృష్టి సారించారు. మద్యం వ్యాపారులంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఒక్కో వైన్స్‌పై 15కు పైగానే దరఖా స్తులు వేస్తున్నట్లు తెలిసింది.