Home » Telangana
మహబూబ్‌నగర్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(ముడా) నిధులను అత్యంత పారదర్శకంగా వినియోగించాలని జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. ఆ నిధులను అనవసరమైన పనుల కోసం వెచ్చించరాదని స్పష్టం చేశారు.
అంకితభావంతో విధులు నిర్వహిస్తేనే ప్రజల మన్న నలు పొందుతారని నారాయణపేట డీఎస్పీ లింగయ్య అన్నారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషిచేస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాపోలీసు వార్షికనివేదిక 2024ను విడుదలచేశారు.
చోరీలకు పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని నారాయణపేట పొలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.19 లక్షల విలువ చేసే బంగారం, రూ.1.50 లక్షల విలువ చేసే వెండిని రికవరీ చేసినట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య తెలిపారు.
‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేలా ఉపాధ్యాయులందరు పని చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు.
బెజ్జూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని అదనపుకలెక్టర్ డేవిడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీచేశారు.
కాలగతిలో 2024 కలిసిపోనుంది. ఈ ఏడాది కొందరికి చేదు అనుభవాలను మిగిల్చగా.. మరికొందరికి తీపి జ్ఞాపకాలను అందించింది. ము ఖ్యంగా రాజకీయ యవనికపై ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా చెప్పకోవాల్సి ఉంది. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారనే విషయాలు మాత్రమే కాకుండా భిన్నమైన తీర్పులను ప్రజలు ఇచ్చారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నూతనంగా ఎంపికైన గ్రూపు-4 అభ్యర్థులు తమ విధులపట్ల నిబద్దతో వ్యవహరించాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు.
జిల్లాలో క్రైం రేట్ వేగంగా పెరుగుతోంది. పోలీస్‌శాఖ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నప్పటికీ చాపకింద నీరులా పెరిగిపోతూనే ఉండటం సర్వత్రా ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాలో వ్యభిచారం, జూదం నిత్యకృత్యం కాగా గంజాయి వినియోగం, నకిలీ విత్తనాల సరఫరా విస్తరిస్తోంది.
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు.