Home » Telangana
రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాగల మూడు రోజుల పాటు వాతావారణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారంటూ ఇద్దర్ని చంపిన మావోయిస్టుల దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరునాగారంలో ఆదివాసీలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వ కుట్రేనని.. కలెక్టర్, అధికారులపై దాడి కాదని, అది ధర్మాగ్రహమేనని, దాన్ని సాకుగా తీసుకుని గ్రామాలను వల్లకాడు చేస్తున్నారని సేవాలాల్‌సేన, పౌరహక్కుల సంఘం, గిరిజన సంఘాలు ఆరోపించాయి.
రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఫార్మా కంపెనీల కోసం రైతులు ఇష్టముంటేనే భూములు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సూచించింది. లేదంటే కోర్టుకు వెళ్లి భూసేకరణపై స్టే తెచ్చుకోవాలని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే 90 శాతం పూర్తయింది. సర్వేలో మొత్తం 1,16,93,698 నివాసాలు గుర్తించగా శనివారం వరకు 1,05,03,257 (90శాతం) నివాసాలలో సర్వే పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్ నడిబొడ్డున రాయదుర్గంలోని నాగాహిల్స్ సొసైటీని చెరబట్టి, అత్యంత విలువైన భూములను దౌర్జన్యంగా అధీనంలోకి తీసుకున్న బడా బాబుల బాగోతంపై ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రచురించిన కథనం తీవ్ర కలకలం రేపింది.
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసేది పారిశ్రామిక కారిడారేనని, ఫార్మాసిటీ కాదని తేల్చిచెప్పారు.
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు, 2268 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి మోక్షం లభించనున్నది. ఆదివారం జిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పత్తిపాక సందర్శించనున్నారు.