Home » Telangana
అధికార దాహంతో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధి రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్యకు గురైన కొంగర నాగమణి భర్త శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసేందుకు సంవత్సర కాలంలోనే రూ.120 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
లక్ష డప్పులు, వేయి గొంతుల మహాకళా ప్రదర్శన వరకు ప్రతీ మాదిగ బిడ్డ ఒక డప్పు కలిగి ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ డా.డప్పు స్వామి పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్ష్యంలో మూడు వంతుల ధాన్యం కొనుగోళ్లు జరుగగా, మరో 30వేల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వేంపల్లి గ్రామం ఇండస్ర్టియల్ హబ్‌గా మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ర్టియల్ హబ్ కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు.
మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపహాడ్ శివారులో ఇండస్ర్టియల్ హబ్ కోసం పేద రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ముల్కల్లలోని దళిత రైతులను కలిశారు. ఆయన మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి, పోచంపహాడ్‌లో ఇండస్ర్టియల్ పార్కు కోసం సుమారు 295 ఎకరాల భూమి సేకరణకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అనుచరులు గ్రామాల్లోని దళిత రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి రిటైర్డు కార్మికులు సింగరేణి క్వార్టర్లలో విద్యుత్ పునరుద్ధరించాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని వివిధ వార్డుల్లో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు విద్యుత్ కనెక్షన్‌ను తొలగిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని, నియోజకవర్గంలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం మల్లంపేటలో పలు గ్రామాలకు సంబంధించి రూ. 1.10 కోట్ల నిధులతో 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ నిర్మాణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాన హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.