Home » Telangana
ఓ వస్తువు ఉత్పత్తి పెరిగితే ధర తగ్గడం సాధారణమే. ప్రస్తుతం వరి ధాన్యానికి ఈ విషయం వర్తించడం లేదు. ఈ వర్షా కాలం సీజన్లో వివిధ కారణాలతో గతంలో కంటే సన్న రకం ఎక్కువగానే సాగైంది. మంచి దిగుబడులు సైతం వచ్చాయి.
గొల్లపల్లి మండలం మల్లన్న పేట మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడవ బుధవారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జగిత్యాల జిల్లాలో బుధవారం క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్‌లో ఉన్న సీఎస్ఐ చర్చితో పాటు గోవిందుపల్లెలోని ఏసురత్నం చర్చి, హౌసింగ్ బోర్డులో ఉన్న క్రైస్ట్ చర్చిలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో పాటు కౌన్సిలర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రార్థనలు ని ర్వహించారు.
మండలంలోని వేంపేట గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శతచండి మహాసుదర్శన నారసింహ యాగ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అ త్యంత ప్రాధాన్యతనిస్తుందని మునిసిపల్ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
సెంట్రల్ లైటింగ్‌తో పట్టణానికి నూతన శోభ సంతరించుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఆరు గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలంలోని కల్యాణలక్ష్మి, షాదీము బారక్ లబ్ధిదారులకు బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చెక్కుల పంపిణీ చేశారు.
క్రీస్తు బోధనలైన శాంతి, ప్రేమ మార్గాలను మానవాళి పాటి స్తూ ప్రశాంతంగా జీవనం సాగించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించా రు.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మునుపెన్నడూ లేనివిధంగా పేదలకు వైద్య చికిత్సలకు పెద్దఎత్తున ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం వాజ్‌పేయి జయంతి సందర్భంగా శంకర్పల్లి మండల కేంద్రంలో చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రత్నం, మండలాధ్యక్షుడు రాములుగౌడ్, జిల్లా నాయకులు తదితరులున్నారు.