Home » Telangana » Warangal
జిల్లాలో పౌరసేవ లను మరింత సులభతరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామా ల్లో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని 12 మండలాల పరిధిలో మొత్తం 57 మీసేవ కేంద్రాలను మంజూరు చేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లో టీఎస్ఎండీసీ ద్వారా న డుస్తున్న ఇసుక క్వారీల్లో అదనపు బకెట్ల దందా జోరుగా సాగుతోంది. టీజీఎండీసీ, రెవెన్యూ, పోలీసు, జల వనరుల శాఖ.. తదితర విభాగాల నుంచి పూర్తి సహకారం ఉండటంతో కాంట్రాక్టర్లు స్వేచ్ఛగా పనికానిచ్చేస్తు న్నారు. ఇటీవల నీటి పారుదల శాఖ అధికారులు బ్యారేజీల్లో పూడికతీత పేరుతో ఇసుక రీచ్లకు ఎన్వోసీ ఇవ్వడంతో టీజీఎండీసీ రంగంలోకి దిగింది.
హనుమకొండ: బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించడం సంతోషకరమని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం మొక్కుబడిగా పరిశీలించారని, కొన్ని నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విమర్శించారు.
ద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు (శనివారం) వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న వాహనాల పన్ను వసూళ్లపై రవాణా శాఖ నజర్ పెట్టింది. ట్యాక్స్ కట్టకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో రోడ్ ట్యాక్స్ రెండేళ్లకు పైగా కట్టకుండా ఉన్న వాహనాలకు అధికారులు ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు.
రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానకి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్తున్న నాయకుల మాటలు నీటి ముటలుగా మిగులు తున్నాయి. నర్మెట మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు రాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.
జనగామ: పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ భవనం ఎక్కి పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
అరకొర వసతులతో కూనారిల్లుతున్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐ)లు త్వరలో కొత్తరూపును సంతరించుకోబోతున్నాయి. కాలం చెల్లించిన సంప్రదాయ కోర్సులతోనే ఇప్పటికీ నెట్టుకువస్తున్న ఈ ఐటీఐలలో ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఆధునాతన సాంకేతిక కోర్సులు త్వరలో ప్రారంభం కానున్నా యి. అన్ని హంగులతో కూడిన ప్రత్యేక భవనాల నిర్మాణం జరుగబోతున్నది. దీనితో ఐటీఐలంటే విద్యార్ధులు, వారి తల్లితండ్రులు చిన్నచూపు చేసే పరిస్థితి మారనున్నది. ఐటీలను ఆధునాతన సాంకేతిక శిక్షణా సంస్థలుగా (ఏటీసీ) మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇళ్లులేని నిరుపేద లు తమ సొంతింటి కల సాకారం కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పుడు నెరవేరుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు అరచేతిలో స్వర్గం చూపుతూ.. గృహాలు మంజూరు చేస్తామని హామీలిస్తూ.. అధికారంలోకి వచ్చాక ముఖం చాటేస్తున్నారని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. తమకు అంతామేలు జరుగుతుం దని భావిస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలనవల్ల నష్టం జరిగిందని యావత్ ప్రజానీ కం కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే సొంత రాష్ట్రంలో కూడా అదేతంతు కొనసాగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంటింట్లో తప్పనిసరైన పచ్చిమిర్చి, ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.