BRS: సీఎం ఎవరిపై ప్రేమ చూపిస్తున్నారో అర్థమౌతోంది: వినయ్ భాస్కర్
ABN , Publish Date - Jun 30 , 2024 | 12:02 PM
హనుమకొండ: బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించడం సంతోషకరమని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం మొక్కుబడిగా పరిశీలించారని, కొన్ని నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విమర్శించారు.
హనుమకొండ: బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరిశీలించడం సంతోషకరమని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని (Super Specialty Hospital) సీఎం మొక్కుబడిగా పరిశీలించారని, కొన్ని నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే (BRS Ex MLA) వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హనుమకొండ (Hanumakonda)లో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న (శనివారం) సీఎం సామాన్యుల గోడు వినకుండా వెళ్లిపోయారని, ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి దగ్గర సీఎం మాట్లాడకుండా... ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.. ముఖ్యమంత్రి ఎవరిపై ప్రేమ చూపిస్తున్నారో అర్థమౌతోందన్నారు. ఎంజీఎం ముందు నుంచే సీఎం వెళ్లినా.. దాన్ని పరిశీలించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన పనులకే తాము చేసినట్టు ఫోటోలకు ఫోజులిస్తున్నారని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఒక్కరూపాయి కూడా కొత్తగా నిధులు తేలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతోందని, మాపై అక్రమ కేసులు పెడుతున్నారని వినయ్ భాస్కర్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు..: ఎంపీ మిథున్ రెడ్డి
నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..
ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News